టీకాల అధికారి ప్రసన్న భారతి…..
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : సర్విక్స్ క్యాన్సర్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాలికలు అందరికీ హెచ్ పి వి టీకా ఆవశ్యకత వివరించి, టీకాలు వేయాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ ప్రసన్న భారతి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని నాయక్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం క్యాన్సర్ అవగాహనకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… హెచ్ పి వి టీకా ప్రాముఖ్యతను, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో టీకా కీలక పాత్రను వివరించారు. బాలికలకు సకాలంలో హెచ్ పి వి టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. టీకా తీసుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, టీకా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యాధికారి బి. సుకుమార్ రెడ్డి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సునీత, జిల్లా నర్సింగ్ అధికారి ప్రమీలా దేవి, సిబ్బంది, , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


