Homeజిల్లాలుఅనంతపురంనషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ – 3కె హెల్త్ పోస్టర్ను ఆవిష్కరించిన వీసీ

నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ – 3కె హెల్త్ పోస్టర్ను ఆవిష్కరించిన వీసీ

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ – 3కె హెల్త్” పోస్టర్ను పరిపాలన భవనంలోనే వీసీ ఛాంబర్ లో బుధవారం వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు ఆవిష్కరించారు.అక్టోబర్ 1న ఉదయం6 గంటలకు జేఎన్టీయూవిశ్వవిద్యాలయం మెయిన్ బిల్డింగ్ సమీపం నుంచి 3కె హెల్త్ వాక్ ప్రారంభమై ఓ.టి.పి.ఆర్.ఐ కళాశాల వరకు కొనసాగుతుందని తెలిపారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా మేల్కొలపడమే ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా. జి. మమత, మై భారత్ ప్రతినిధి బిసాతి భరత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు