ఫ్లైదుబాయ్ FZ1073విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు భారీ గుర్తింపు లభించింది. ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించింది.
ఈ మొత్తాన్ని కెప్టెన్ మచ్చార్‌తో పాటు ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఖ్గీ1073 విమానంలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సౌదీ, ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. కో-పైలట్ కెప్టెన్ మచ్చార్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో విమానం భారీగా కిందికి దూసుకెళ్లింది.
ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి సురక్షితంగా మళ్లించారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఫ్లైదుబాయ్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన వెనుక ఉన్న కారణాలు, ఉద్దేశాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఫ్లైదుబాయ్ స్పష్టం చేసింది.
ధ్రువీకరించిన భారత రాయబార కార్యాలయం
కాగా, కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది.మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కూడా ఆయనకు ప్రత్యేక శౌర్య పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కెప్టెన్ మచ్చార్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ మాన్‌కైండ్ ఫార్మా సంస్థ రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించింది.ఃతన కంటే సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారుఃః అంటూ ఆయన సాహసాన్ని సంస్థ కొనియాడింది.ఈ నగదు బహుమతిని కెప్టెన్ మచ్చార్‌తో పాటు ఆయన కుటుంబానికి అందించనున్నట్లు మాన్‌కైండ్ ఫార్మా తెలిపింది.


