Homeజిల్లాలుఅనంతపురంపప్పుశనగకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి

పప్పుశనగకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి

- Advertisement -

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వద్ద ధర్నా

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు పప్పుశనగ విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న 35 శాతం సబ్సిడీని 80 శాతానికి పెంచి రైతులకు అవసరమైన మేరకు పప్పుశనగ విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అనేక మంది రైతులు పంటలు సాగు చేయలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రబీ సీజన్‌పై రైతుల్లో ఆశలు పెరిగాయని, ముఖ్యంగా పప్పుశనగ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే 80 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సరిపడా విత్తనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, ఓబన్న, వేమన్న, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు