- Advertisement -
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : గుంతకల్లు నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.శ్రీనివాసరావు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ ని ఆయన ఛేంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్పీ కి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే బదిలీపై వచ్చిన ఆయన గుంతకల్లు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీని కలిశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, డివిజన్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘా తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా డీఎస్పీని ఎస్పీ జగదీష్ ఆదేశించారు.


