Homeజిల్లాలుఅనంతపురంగుంతకల్లు నూతన డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

గుంతకల్లు నూతన డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​గుంతకల్లు నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.శ్రీనివాసరావు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ ని ఆయన ఛేంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్పీ కి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ​ఇటీవలే బదిలీపై వచ్చిన ఆయన గుంతకల్లు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీని కలిశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, డివిజన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘా తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా డీఎస్పీని ఎస్పీ జగదీష్ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు