Homeఅంతర్జాతీయంమళ్లీ ట్రిలియనీర్ అయిన ఎలాన్ మస్క్.. రికార్డు స్థాయిలో సంపద!

మళ్లీ ట్రిలియనీర్ అయిన ఎలాన్ మస్క్.. రికార్డు స్థాయిలో సంపద!

- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్ల జాబితాలో చేరారు. మూడు నెలల విరామం తర్వాత ఆయన సంపద మళ్లీ 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పెరగడంతో సోమవారం ఒక్కరోజే ఆయన సంపద 65 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత ఆస్తి విలువ 1.04 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ నెల ఆరంభం నుంచి స్పేస్‌ఎక్స్ షేర్లు 13 శాతం, టెస్లా షేర్లు 6.7 శాతం మేర లాభపడ్డాయి. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ (సుమారు 371.5 బిలియన్ డాలర్లు) సంపద కంటే మస్క్ ఆస్తి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ పెరుగుదల వెనుక స్పష్టమైన కారణాలున్నాయి. స్పేస్‌ఎక్స్ కంపెనీలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ఇవ్వడం సానుకూల ప్రభావం చూపింది. దీనికి తోడు, ఇటీవల స్పేస్‌ఎక్స్ నిర్వహించిన ఃస్టార్‌షిప్ః ఫ్లైట్ టెస్ట్ విజయవంతం కావడం కూడా షేర్ల విలువ పెరిగేందుకు దోహదపడింది. మరోవైపు, టెస్లా కంపెనీ మూడో త్రైమాసికంలో అంచనాలకు మించి వాహనాలను డెలివరీ చేయడంతో శుక్రవారం నాడే మస్క్ సంపదకు 61 బిలియన్ డాలర్లు జతయ్యాయి.

55 ఏళ్ల మస్క్ ఈ ఏడాది జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఆయన సంపద 1.45 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే, ఆ తర్వాత షేర్ల విలువ పడిపోవడంతో జులై చివరి నాటికి ఆయన సంపదలో 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కోత పడింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుని ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయితే, ఈ సంపదంతా నగదు రూపంలో కాదని, స్టాక్ మార్కెట్‌లోని షేర్ల విలువ ఆధారంగా వేసే అంచనా అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు