Homeసంపాదకీయంస్వయంప్రతిపత్తిపై నీలినీడలు

స్వయంప్రతిపత్తిపై నీలినీడలు

- Advertisement -

భారతదేశంలో కనీవినీ bరుగని రీతిలో bన్నికల వ్యవస్థకు పరీక్షా సమయం bదురైంది. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు పారదర్శకమైన bన్నికల ప్రక్రియ. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలు నిష్పా¿ాìకంగా వ్యవహరించినప్ప్పుడే ఆ ప్రక్రియపై పౌరుల్లో విశ్వాసం నిలుస్తుంది. అయితే, కేంద్ర bన్నికల సంఘం (ఈసీఐ) చుట్టూ ముసురుకున్న తాజా వివాదాలు, ప్రధాన bన్నికల కమిష నర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై వెల్లువెత్తుతున్న తీవ్ర ఆరోపణలు భారత ప్రజాస్వామిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. దేశచరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా, ఒక ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న అధికారిని తక్షణమే తొలగించాలంటూ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, పౌరసమాజం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టడం వ్యవస్థాగత సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అధిపతి తొలగింపు కోసం ఇంతటి స్థాయిలో దేశవ్యాప్త ఉద్యమం రగలడం నిజంగా అపూర్వం…అదే సమయంలో అత్యంత ఆందోళనకరం కూడా. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేం దుకు అనుసరించే సంక్లిష్టమైన ‘మహాభియోగ’ లేదా ‘అభిశంసన’ (ఇంపీచ్‌మెంట్) తరహా ప్రక్రియ రక్షణ ఉన్న సీఈసీ పదవిపై, ప్రజల నుంచి ఇంతటి తీవ్ర అసంతృప్తి పెల్లుబకడానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి పదేపదే రావడం ఒకింత బాధాకరమే. మోదీ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వసనీయత లోపించి నందునే సీఈసీ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారింది. ఈ ఉద్యమానికి ఆజ్యం పోసిన అంశాలు కేవలం రాజకీయ అసంతృప్తికి మాత్రమే పరిమితం కాలేదు. కమిషన్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, వివాదాస్పద అంశాలపై స్పందించిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చాయి. ముఖ్యంగా bన్నికల ప్రవర్తనా నియమావళి (bంసీసీ) అమలులో ద్వంద్వ ప్రమాణాలు పాటించారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అధికార పార్టీ నేతల ప్రసంగాలు, నిబంధనల ఉల్లంఘనలపై కళ్లుమూసు కుని, ప్రతిపక్షాలపై మాత్రం కఠినంగా వ్యవహరించారన్న విమర్శలు బలంగా వినిపించాయి. bన్నికల షెడ్యూల్ ఖరారు, దశల విభజన వంటి అంశాల్లో ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఒకవైపు ఉండగా, ఓటిం>ù శాతాల వెల్లడిలో జరిగిన జాప్యం, తుది గణాం కాల విషయంలో నెలకొన్న అస్పష్టత అనుమానాలను రెకెత్తించాయి. వీటికి తోడు, bలక్ట్రానిక్ ఓటిం>ù యంత్రాలు (ఈవీbం), వీవీప్యాట్ లెక్కింపుల పారదర్శకతపై వచ్చిన అభ్యంతరాలను నివృత్తి చేయకపోవడం, పౌరసమాజం లేవనెత్తిన సాంకే తిక సందేహాలను తోసిపుచ్చడం వంటి పరిణామాలు కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేశాయి. ఇవన్నీ ఒకెత్తయితే, ‘సర’ ప్రక్రియ సీఈసీ ఆడిన ఓ దోబూచులాట. ప్రతిపక్షాల ఓటిం>ù పాయింట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం, ద¿ాìణాది రాష్ట్రాల ప్రాధాన్యతను ‘జీరో’ చేయడం వంటి బీజేపీ రహస్య bజెండాలో భాగంగా ఈ ‘సర’ మిషన్ కొనసాగిం దనేది సర్వవిధితమే. అందుకే, సీఈసీ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టంపై మొదట్లోనే అనుమానాలు తలెత్తగా, ప్రస్తుత పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా మారాయి. సాధారణంగా పాలసీలకో, ధరల పెరుగుదలకో వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చే ప్రజలు, ఈసారి ప్రజాస్వామ్య మూలాల రక్షణ కోసం ఉద్యమబాట పట్టడం గమనార్హం. దిల్లీలోని జంతర్ మంతర్ మొదలుకొని ద¿ాìణాది రాష్ట్రాల వరకూ విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, సాధారణ ఓటర్లు శాంతియుత నిరసనలకు దిగడం చిన్న విషయం కాదు. నిష్పా¿ాìకంగా వ్యవహరిం చాల్సిన ‘అంపైర’ పక్షపాత ధోరణి కనబరిస్తే ఆటకే విలువుండదన్న ఆవేదన ఈ ఉద్యమాలలో స్పష్టంగా ప్రతిబింబి స్తోంది. bన్నికల ఫలితాలు ఏవైనా, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఏర్పడే నమ్మకమే ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన పునాది. ఆ పునాది కదులు తోందన్న భయమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. దేశం నలు మూలల నుంచి ఇంతటి నిరసన స్వరాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ప్రజల భావోద్వేగాలను, ప్రతిపక్షాల డిమాం డ్లను కేవలం ‘రాజకీయ ప్రేరేపిత ప్రచారం’గా కొట్టిపారేసే ప్రయత్నం సమస్య తీవ్రతను తగ్గించ లేదు.. పైగా మరింత ఉద్రిక్తం చేస్తోంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ప్రజల్లో ఇంతటి అపనమ్మకం ఏర్పడినప్ప్పుడు, బాధ్యతా యుతమైన ప్రభుత్వం స్పందించి పారదర్శకతను చాటుకోవాలి. నిరసన కారులతో చర్చలు జరపడం, అవసరమైతే విచారణకు ఆదేశించడం లేదా పార్లమెంటరీ వేదికగా సమగ్ర వివరణ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాల్సింది పోయి, సమస్యే లేదన్నట్లు ప్రవర్తించడం పాలకుల అలసత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వ మౌనం అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసమేనా అన్న అనుమానాలకు ఆస్కార మిస్తోంది. bన్‌డీఏయేతర రాజకీయ పక్షాలతో పాటు ఏఐbస్bఫ్, ఏఐbసఏ, bస్bఫఐ, ఏఐవైbఫ్, డీవైbఫఐ వంటి విద్యార్థి, యువజన సంఘాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లు సాగిస్తున్న పోరు జ్ఞానేశ్ తొలగింపు ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆగేలా కనబడటం లేదు. వీరి ఉద్యమాన్ని ఆపడానికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు bన్ని అఘాయి త్యాలకు పాల్పడుతున్నా ఆందోళన మాత్రం గురితప్పడం లేదు. తాజాగా జంతర్‌మంతర్ వద్ద ఈ ఆందోళనల సందర్భంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయం. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా దిల్లీ పోలీసులు bఫఐఆర్ నమోదు చేయకపోవడం మోదీషా నీచసంస్కృతి పోలీసు ఠానాలకూ వ్యాపించిందనడానికి పక్కా నిదర్శనం. కాకపోతే, దీనిపై అమిత్‌షా సమాధానం చెపుతారని ఆశించలేం. వ్యవస్థల పునరుజ్జీవనం తక్షణావసరమని ఈ ఆందోళనలు గుర్తుచేస్తున్నాయి. భారత ప్రజా స్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది మాత్రమే కాదు, bందరికో ఆదర్శ ప్రాయమైనది. టి.bన్.శేషన్ వంటి మహోన్నత అధికారులు bన్నికల సంఘం ప్రతిష్ఠను ఏ స్థాయికి తీసుకెళ్లారో దేశ ప్రజలకు తెలుసు. అటు వంటి ప్రతిష్ఠాత్మక సంస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోవడం జాతికే చేటు. ఇప్ప్పుడు పరిస్థితి వ్యక్తిగతంగా ఒక అధికారిని సమర్థించడమో లేక వ్యతి¹ sకించడమో కాదు…యావత్ bన్నికల ప్రక్రియ ఔన్నత్యాన్ని కాపాడు కోవడమే ప్రధానం. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరిని విడ నాడాలి. వీధుల్లో వ్యక్తమవుతున్న ప్రజాభీష్టాన్ని గుర్తించి, bన్నికల సంఘం పారదర్శకతను నిరూపించే దిశగా తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సీఈసీ తన స్వచ్ఛంద రాజీనామా ద్వారా వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్ట డమా, లేక పార్లమెంట్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభిం# áడమా అన్నది తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల ఓటు హక్కు పవి త్రతను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా, అది భవిష్యత్ తరాల ప్రజాస్వామిక భద్రతకే గొడ్డలిపెట్టుగా మారుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు