చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
విశాలాంధ్ర – శామీర్ పేట్ :- అర్హులైన పేదలకు ఇళ్లు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్ పేట్ గ్రామంలోని 6వ వార్డులో కావటి సరిత , మురళి దంపతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కాగా నూతనంగా నిర్మించకున్న ఇంటిలో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదింటి వారికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒక సొంతింటి కల నెరవేరిందుకు పేదల కళ్లలో వెలుగులు నిండాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్హులైన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని వారు స్పష్టం చేశారు, ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్,ఏఏంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి ,జిల్లా కార్యదర్శి భూమి రెడ్డి నవీన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు బండరి బాబు,అబ్బాగౌని భాస్కర్ గౌడ్ , చిలుగురి మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి,ఇప్ప మాధవ రెడ్డి, బండ సతీష్,కుంచె సత్యనారాయణ,గ్రామస్తులు పాల్గొన్నారు.


