ప్రజాసేవే లక్ష్యంగా ముందడుగు
విశాలాంధ్ర – వత్సవాయి : మండలంలోని పోలంపల్లి గ్రామంలో ఎంపీటీసీ పదవికి సంబంధించి రాజకీయ చర్చలు ఆసక్తిని రేకెతిస్తున్నాయి.ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోలంపల్లి గ్రామానికి చెందిన దారెల్లి చిరంజీవి సతీమణి. రాణి పేరు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం.మండల స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి నియోజకవర్గ స్థాయిలో పార్టీలో పని చేస్తూ ప్రజలందరితో మమేకమై గ్రామ పాఠశాల అభివృద్ధి కొరకు మరియు ఆటో డ్రైవర్ల కొరకు మొదలగు ఎన్నో కార్యక్రమాల్లో తన వంతు దాతృత్వాన్ని చాటుకున్నారు.నియోజకవర్గ స్థాయిలో దారెల్లి అనే ఒక బ్రాండ్ ని స్థాపించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న దారెల్లి చిరంజీవి సతీమణి రాణికు సీటు దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
పోలంపల్లి గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి రేసులో దారెల్లి చిరంజీవి సతీమణి రాణి
- Advertisement -
RELATED ARTICLES


