Homeహైదరాబాద్రాజ్యాంగం ప్రజాస్వామ్యం పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం :: మంత్రి పొన్నం ప్రభాకర్

రాజ్యాంగం ప్రజాస్వామ్యం పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం :: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
  • ఓటరు జాబితాల సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ
  • తెలంగాణలోను లక్షల ఓట్లు తొలగించారని వ్యాఖ్య
    విశాలాంధ్ర – హైదరాబాద్ :: ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఓటరు జాబితాల సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పొన్నం పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలుపోటములకు భయపడదని, ఎన్నికల ముందు, తర్వాత ప్రజలతోనే ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతుందని తెలిపారు.గతంలో అనర్హుల ఓట్లను మాత్రమే తొలగించేవారని, ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా ఉన్న అర్హుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ వైఖరిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, న్యాయ నిపుణులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే కాంగ్రెస్‌ లక్ష్యమని, రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని పొన్నం చెప్పారు. ఓటరు జాబితాల అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు