Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవ వేడుకలు

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆధునిక మానవ శరీర నిర్మాణ శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ శరీర నిర్మాణ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రియాస్ వెసాలియస్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న నిర్వహించే ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవాన్ని, గురువారం ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురములోని శరీర నిర్మాణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు శరీర నిర్మాణ శాస్త్ర విభాగాధిపతి మరియు ఆచార్యులు డాక్టర్ ఎస్. ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం. విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… వైద్య విద్యలో మానవ శరీర నిర్మాణ శాస్త్రం పునాది వంటిదని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉత్తమ వైద్యులుగా ఎదగాలని సూచించారు. అనంతరం 2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా ప్రవేశం పొందిన ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం శరీర నిర్మాణ శాస్త్ర అంశాలపై క్విజ్ పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహ ఆచార్యులు డాక్టర్ ఎం. నరేంద్ర నాయక్, డాక్టర్ ఎస్. అహ్మద్ పీర్, డాక్టర్ పి. పద్మజ; సహాయ ఆచార్యులు డాక్టర్ బి. షహజీర్, డాక్టర్ బి. ఆంజనేయ బాబు నాయక్; ట్యూటర్ డాక్టర్ ప్రియ భావన మరియు పీజీ విద్యార్థులందరూ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు