పాల్గొన్న మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
విశాలాంధ్ర,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల పరిధిలోని సంగెం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కేశంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ దుర్గాదేవి పండాల్ను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా జవాజీ శాంతమ్మ నాగభూషణం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశాల మాట్లాడుతూ…. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


