- Advertisement -
విశాలాంధ్ర – రాజేంద్రనగర్ బుద్వేల్ టీచర్స్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.6 వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సురేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో అందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.


