Homeజిల్లాలుకడపజర్నలిస్టుల కుటుంబాలలో నిత్యం వెలుగులు నిండాలి: క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి

జర్నలిస్టుల కుటుంబాలలో నిత్యం వెలుగులు నిండాలి: క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి

- Advertisement -

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు దీపావళి కానుకల పంపిణీ

విశాలాంధ్ర – రాజంపేట: సమాజానికి నిరంతరం వార్తా సమాచారాన్ని అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో నిత్యం వెలుగులు నిండాలని క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్‌రాజు ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ప్రతి పండుగ జర్నలిస్టుల కుటుంబాల్లో సంతోషాలను నింపాలని అన్నారు. ఆదివారం ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బచ్చోటి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు దీపావళి కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రాజు మాట్లాడుతూ సమాజంలో నిత్యం చోటుచేసుకునే పరిణామాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహించే జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో పండుగలు జరుపుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. మీడియా ప్రతినిధులకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న బచ్చోటి భాస్కర్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం జర్నలిస్టులు బచ్చోటి భాస్కర్‌ను శాలువాతో సత్కరించారు. దీపావళి కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్టీవీ రిపోర్టర్ దార్ల శ్రీనివాసాచారి, జీ.రాయలు, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి మందా శివయ్య, ఉపాధ్యక్షుడు మద్దికేర ఓబులేసు, కోశాధికారి బాలిపోగు సునీల్, నాగేంద్రప్రసాద్, హరి, సాయి, దివాకర్, చామంచి వెంకటసుబ్బయ్య, నాగరాజు, ప్రవీణ్, దుర్గయ్య, సుధాకర్, నరసింహ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు