Homeజిల్లాలుకడపరోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

- Advertisement -


విహారానికి వెళుతుండగా విషాదం

చెన్నూరు-కడప జిల్లా: విద్యార్థులు విహారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఏర్పేడు మండల పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌)లో వైజాగ్‌కు చెందిన ఠాగూర్‌రెడ్డి, కేరళకు చెందిన అనుగ్రహ, రుషికా(23), అఖిల్, సుషీన్, భవ్యలు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం వీరందరూ రెండు ద్విచక్ర వాహనాలపై తిరుపతి నుంచి గండికోటకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం చెన్నూరు మండల పరిధిలోని ఇర్కాన్‌ సర్కిల్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొంది. ఠాగూర్, అనుగ్రహ డివైడర్‌పై పడ్డారు. రోడ్డుపై పడిన రుషికాపై లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు