విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు రాఘవేంద్ర, శివరాం, నాగార్జున, నరేంద్ర మాట్లాడుతూ2003-04 సంవత్సరపు బ్యాచ్కు సంబంధించిన తాము 90 మంది ఒకే చోట కలవడం ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. ఆనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి గురువులను కలవడం ఒక అపూర్వ సంఘటనగా ఉందని వారు తెలిపారు. నేడు పూర్వ విద్యార్థుల ఆయన మేము గురువులు తల్లిదండ్రుల ఆశీస్సుల మేరకు వారి వారి స్థాయిలలో జీవితంలో స్థిరపడడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనా గురువులను మరోసారి ఒకే వేదిక మీద కలవడం మాకు చక్కటి ఉత్సాహంతోపాటు గర్వంగా ఉందని తెలిపారు. 90 మంది విద్యార్థులు వేదిక మీద ఆనాటి పాఠశాలలో తాము నేర్చుకున్న జ్ఞాపకాలను వారు మాట్లాడారు. తదుపరి పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్, మాజీ హెడ్మాస్టర్ శ్రీనివాసులురెడ్డి, డ్రిల్ మాస్టర్ లక్ష్మీనారాయణ, సైన్స్ టీచర్ సంజీవయ్య, ఆంగ్లం టీచర్ శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. త్వరలో మా పూర్వ విద్యార్థుల తరఫున పాఠశాలకు తగిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ఈ సమ్మేళన విజయవంతం చేశారు.
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
RELATED ARTICLES