Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్మనోబంధు సేవలను విస్తరిస్తాం.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ

మనోబంధు సేవలను విస్తరిస్తాం.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ

విశాలాంధ్ర -ధర్మవరం : మనోబంధు ఫౌండేషన్ సంస్థను ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా విస్తరించడం విస్తరించడం జరుగుతుందని డాక్టర్ సత్య నిర్ధారణ, డాక్టర్ నరసింహులు, శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశములో కార్యాచరణ ప్రణాళిక పై చర్చలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మనోబంధు సేవలను విస్తరించడానికి కార్యక్రమ ప్రణాళికలను సంసిద్ధం చేస్తున్నట్లు వారి తెలిపారు. మానసిక బాధితుల పునరావాసం కల్పించడానికి ఏపీలోని అన్ని జిల్లాలలోనూ స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములు చేయడానికి మనోబంధు ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన సత్య నిర్ధారణ నిర్వహించారు. తదుపరి వివిధ స్వచ్ఛంద సంస్థలతో ముఖాముఖిని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. రహదారి మానసిక బాధితులకు పునరావాస కార్యక్రమాలు నిర్వహించేలా ఉత్తేజాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ మూడవ తేదీన ధర్మవరంలోని పోలా ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మనోబంధు కవిత శీర్షికను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా మనో బంధు కన్వీనర్ గా వీరే శ్రీరాములు ఎంపిక కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, పరిష్కార దిశలో అందరూ నడవాలని తెలిపారు. తదుపరి గుంతకల్ నుండి రాధా మహిళా మండలి తులసి భాయ్ కూడా మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్న దృక్పథంతో అందరూ వెళ్లాలని తెలిపారు. అనంతపురం పాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రామప్ప మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ రాయచోటి లో జరిగే స్వచ్ఛందల సంస్థల సమావేశంలో మరింత చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా జాతీయస్థాయిలో వీటిని పరిచయం చేయడానికి కడప నగరంలో డిసెంబర్ 8వ తేదీన సామాజిక చైతన్య సంస్థ వారిచే ప్రజాసంఘాల స్వచ్ఛంద సంస్థల నేషనల్ వర్క్ షాప్ లో తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.మానసిక బాధితుల యొక్క సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే శ్రీరాములు సెల్ నెంబర్ 73308004832 తెలాపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, తులసి బాయ్, రామప్ప, రోటరీ క్లబ్ నరేందర్ రెడ్డి, జయసింహ, వేణుగోపాల్, రమేష్, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు