తల్లిదండ్రులు లేని అనాథ విద్యార్థులకు ప్రత్యేక ప్రతిభ పురస్కారాలు….కాకతీయ కమ్మ సేవా సంఘం.
విశాలాంధ్ర ధర్మవరం;;శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో 550 మార్కులకు పైగా సాధించిన కమ్మ సామాజిక వర్గ విద్యార్థులు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ కమ్మ సేవా సంఘం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాథ విద్యార్థులకు మార్కులతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు సంఘం తెలిపారు. పట్టణంలోనీ కమ్మ సంఘం కార్యాలయంలో కుల బాంధవులు సమావేశమై ఈ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. సమావేశంలో సంఘ పెద్దలు, సభ్యులు పాల్గొని పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కమ్మ సమాజానికి చెందిన, ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు “ప్రతిభ పురస్కారాలు” అందజేయనున్నట్లు సంఘం సభ్యులు ప్రకటించారు. సమాజంలోని ప్రతిభను ప్రోత్సహించడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం సంఘం లక్ష్యమని తెలిపారు.అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను మే 22వ తేదీలోపు సమర్పించాలని తెలిపారు. మరింత సమాచారం కొరకు కార్యాలయ ఫోన్ నెంబర్ 9989390700 ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి
- Advertisement -
RELATED ARTICLES


