ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ సాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి ఎంపిక కావడం జరిగిందని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే మే 22 నుండి మే 28 వరకు పాండిచ్చేరి రాష్ట్రంలో జరిగే 76 వ నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల బాస్కెట్బాల్ జట్టు ఎంపికకు మే 10 నుండినుండి 20వ తేదీ వరకు చిత్తూరు నగరంలో జరిగే కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన బాలికల విభాగంలో కిరణ్మయి ఎంపిక కావడం గర్వకారణమని వారు తెలిపారు. మే ఒకటో తేదీ నుండి మే 4 వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నందు జరిగిన అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో కిరణ్మయి ప్రతిభా చూపి ఆంధ్రప్రదేశ్ పాపబుల్స్ జట్టుకు ఎంపిక పట్ల , శెట్టిపి జయచంద్రారెడ్డి తో పాటు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, హర్షం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.
కోచింగ్ క్యాంప్ కు ధర్మవరం బాలికఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


