యువర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జయరాం షీలా నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో డిసెంబర్ 6వ తేదీ నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, దాతల సహాయ సహకారములతో వేలాదిమందికి కంటి ఆపరేషన్ నిర్వహించి, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు పూజారి చౌడమ్మ జ్ఞాపకార్థం భర్త పూజారి నారాయణ (రోజా సిల్క్స్ ధర్మవరం) వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డ్ జిరాక్స్ తో పాటు ఫోన్ నెంబర్ తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఉచిత కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచిత ఆపరేషన్, ఉచిత వశతి, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి వెంకట నాగార్జున, సహకార దర్శి గొర్రె రమేష్ బాబు, పి.ఆర్.ఓ రాధాకృష్ణ, క్యాంపు చైర్మన్ చాంద్ భాషా, డాక్టర్ బి బి సుబ్బారావు, పోలా ప్రభాకర్, వై కే శ్రీనివాసులు, ఓవి ప్రసాద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కేత లోకేష్, కృష్ణమూర్తి ,లక్ష్మీనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


