విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన డాక్టర్ సంకారపు నర్సింహులుకు రాష్ట్ర ప్రతిభా పురస్కారం లభించినందున, జిల్లా ఆరోగ్య వైద్యశాఖ తరఫున డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాగ్యలక్ష్మి, జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ అనురాధ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చెన్నారెడ్డి, డిప్యూటీ హెచ్ విజయ్ కుమార్, వైద్యాధికారి ఉరుకుందప్ప ,సి ఓ లక్ష్మీనారాయణ తదితరులు డాక్టర్ నరసింహులు ఇంటికి స్వయంగా వెళ్లి డాక్టర్లకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ మీరు పదవి విరమణ పొందిన కూడా వైద్య శాఖను మరవకుండా తమకున్న పరిధిలో జిల్లా ప్రజలకు ఆరోగ్య విషయంలో గాని, ఇతరత్రా విషయంలో గాని ఎన్నో సేవలు చేయడం వలనే ఈ అవార్డు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని వారు ఆకాంక్షించారు.
డాక్టర్ నరసింహులుకు అభినందన వెల్లువ
- Advertisement -
RELATED ARTICLES


