Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అయుబుఖాన్

ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అయుబుఖాన్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 1 నుండి మూడవ తేదీ వరకు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు సిఐటియు ఆధ్వర్యంలోకార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దుచేసి, వేతనాల పెంపు,తదితర డిమాండ్ల సాధనకై, హలో కార్మిక చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 1, 2,3 ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి ప్రచారంలో భాగంగా సిఐటియు జిల్లాకమిటీ పిలుపుమేరకు ధర్మవరం పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్, కాలేజ్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, పి ఆర్ టి సర్కిల్, గాంధీనగర్ సర్కిల్, అంజుమాన్ సర్కిల్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మునిసిపల్ రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీరాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, అయూబ్ ఖాన్, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దుచేసి, కార్మికులకు కనీస వేతనం 42000/-రూ అమలు చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, డిసెంబర్ ఒకటి నుండి మూడో తేదీ వరకు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
సిఐటియు మండల కో కన్వీనర్ రఫీ, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మేకలబాబు, బి,నాగరాజు, కోశాధికారి ఎం,నాగభూషణ, రెగ్యులర్ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నాగరాజు, ఓబులప్పా, చెన్నకేశవులు,శీనా, బాలమురళి, గజ్జల సూర్యనారాయణ, రమేష్, నారాయణస్వామి, మారుతి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు