ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం.. ఈవీఎంలను తెరిచి లెక్కింపు చేపడుతున్నారు..
- ఆప్ అభ్యర్థి అతిషి ప్రస్తుతం బిజెపి అభ్యర్థి రమేష్ బిధురి కంటే 3231ఓట్లు వెనుకబడి ఉన్నారు.
- ఢిల్లీ మాజీ విద్యా మంత్రి మనీష్ సిసోడియా 3869 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
- అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న స్థానంలో 430ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
- జంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ మాజీ విద్యా మంత్రి మనీష్ సిసోడియా బిజిపి అభ్యర్ధి తర్వింధర్ సింగ్ కంటే 1314 ఓట్లతో వెనుకబడి ఉన్నారు.
- కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అభ్యర్థి అతిషి ప్రస్తుతం బిజెపి అభ్యర్థి రమేష్ బిధురి కంటే 1149ఓట్లు వెనుకబడి ఉన్నారు.
- అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న స్థానంలో ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ పై 254 స్పల్ప మెజారిటీ ఉన్నారు.
- గ్రేటర్ కైలాష్ నుంచి ఆప్ అభ్యర్థి, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ 449 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- కరవాల్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా 3109 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- బాబర్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ 5602 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి బిజెపి ముందంజలో కొనసాగుతుంది. 36స్థానాల్లో బిజెపి ముందంజలో ఉండగా, 16స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది.
- ఓట్ల లెక్కింపు ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఆయనతో పాటు అతిషి, మనిష్ సిసోడియాలు కూడా వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఒకే ఒక స్థానంలో ముందంజలో ఉంది.