సీఢీపీఓ శర్మిష్ట
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : ప్రతి మహిళ సరైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని సీఢీపీఓ శర్మిష్ట అన్నారు. బుధవారం వలేటివారిపాలెం మండలంలోని చుండి అంగన్వాడీ సెంటర్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీడీపీఓ శర్మిష్ట హాజరైనారు ఈ సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ అయినటువంటి అందరికి మహిళలు మరియు బాలికల కోసం హక్కులు, సమానత్వం, సాధికారత కొరకు ర్యాలీ నిర్వహించారు.ఈసీసీఈ డే, పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ పైన తల్లులకి అవగాహన కల్పించారు , పిల్లలకి అక్షరాభ్యాసం, గర్భవతులకి శ్రీమంతం కార్యక్రమం జరిపించారు. ఈ సందర్బంగా సీడీపీఓ శర్మిష్ట మాట్లాడుతూ ప్రతి మహిళ ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్లే నని అన్నారు. కుటుంబ పరంగా ప్రతి మహిళ తన ఆరోగ్యం విస్మరించి కుటుంబమే ముఖ్యమని సక్రమంగా ఆహరం తీసుకోకపోవడం వలన ఆమె అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతి బాలిక, ప్రతి మహిళ తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజు శరీరానికి వ్యాయామం అవసరమని, ప్రతి రోజు యోగా చేయాలని ఆమె చూచించారు. ఈ కార్యక్రమంలో సూపెర్వైజర్ సునీత , అంగన్వాడీ కార్యకర్తలు జ్యోతి, రాజ్యలక్ష్మి ఆయాలు సుశీల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.