విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షా ఫలితాలను ప్రకటించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 15,16 వ తేదీల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తుది కీ, ఓఎంఆర్, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు జనరల్ ర్యాంకింగ్‌ను కింద ఇచ్చిన లింక్‌ని షషష.్‌ంజూంష.స్త్రశీఙ.ఱఅ ఉపయోగించి జాబితాలో తనిఖీ చేసు కోవాలన్నారు. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 టాపర్‌కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకులతో పాటు తుది ‘కీ ’ కూడా విడుదలైంది. ఓఎంఆర్ షీట్స్‌ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
టాప్ -10 ర్యాంకర్ల జాబితా ఇదే…
కరింగు నరేష్ (422.989 మార్కులు)
నారు వెంకట హర్షవర్దన్ (447.088 మార్కులు)
వడ్లకొండ సచిన్ (444.754 మార్కులు)
బి మనోహర్‌రావు (439.344 మార్కులు)
శ్రీరామ్ మధు (438.972 మార్కులు)
చింతపల్లి ప్రీతమ్ రెడ్డి (431.102 మార్కులు)
అఖిల్ ఎర్రా (430.807 మార్కులు)
గొడ్డేటి అశోక్ (425.842 మార్కులు)
చిమ్ముల రాజశేఖర్ ( 423.933 మార్కులు)
మేకల ఉపేందర్ (423.119 మార్కులు)