Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని నేసే పేటలో గల లక్ష్మీపతి భార్య నీరుగంటి అఖిల (21) సోమవారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో చీరతోఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వన్ టౌన్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నీరు గంటి అఖిల లక్ష్మీపతి లకు రెండు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు వివాహమును ఘనంగా నిర్వహించారు. తదుపరి వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల నడుమ, కుటుంబ సభ్యుల నడుమ గొడవ కొనసాగేది అని తెలిపారు. మృతురాలు అఖిల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుందని తెలిపారు. ఈ దంపతులకు సంతానం కూడా లేదు అని వారు తెలిపారు. మనస్పర్ధలు గొడవలు, భర్త వారి కుటుంబ సభ్యులు గొడవలు రావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని తెలిపారు. మృతురాలి తల్లి కళావతి తన కుమార్తె చావుకు అల్లుడైన లక్ష్మీపతి, వారి కుటుంబ సభ్యులే కారణమంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతురాలు భర్త లక్ష్మీపతిని అదుపులో తీసుకున్నట్లు వారు తెలిపారు. తదుపరి వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు