Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్మహాగణపతికి మహా నైవేద్యం

మహాగణపతికి మహా నైవేద్యం

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : మండల వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటైన చవితి పందిర్లలో వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. కొవ్వూరు పట్టణం మెరకవీధి రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి పందిట్లో సుమారు 23 అడుగుల వినాయక విగ్రహం ఆకట్టుకుంటుంది. స్వామి తలపైన ఏర్పాటు చేసిన దేవతలు, రాక్షసులు చేస్తున్న క్షీర సాగర మధనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిపారు. 108 రకాల పిండి వంటలతో స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించారు. అదే విధంగా స్వామివారికి మహా గరిక పూజ నిర్వహించారు. యూత్ సభ్యుల ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు