Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : అభివృద్ధి , సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం అని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో 15 వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు 94 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేంకటేశ్వరరావు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్డీఏ కూటమి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. వచ్చే పుష్కరాలకు కొవ్వూరు పట్టణాన్ని అభివృద్ధి పూర్తిగా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా 18 వ వార్డు ఆర్ఆర్ టౌన్షిప్ లో 32.50 లక్షలతో సీసీ రోడ్, సత్యవతి నగర్ లో 18 లక్షలతో సీసీ రోడ్, 6.50 లక్షలతో మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు, 10 వ వార్డు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో 15 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం, 14 వ వార్డు బ్రిడ్జి పేటలో 14.50 లక్షలతో అప్రోచ్ సీసీ రోడ్, హౌసింగ్ లేఔట్ నాలుగులో 7.50 లక్షలతో మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పనులను ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు సురపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ కుమార్, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ, పెనుమాక జయరాజ్ , కమిషనర్ గ్రంధి సందీప్ , కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు