Saturday, March 7, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన ఎంపీపీ

ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన ఎంపీపీ

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఉన్న ఐసిడిసి, మండల మహిళా సమాఖ్య కార్యాలయాలను ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఐసిడిసి సిపిటిఓ కే నాగలక్ష్మి వెలుగు ఎంపిఎం కె బి విజయనిర్మల వారి కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ కు తెలియజేయగా ఆయన బుధవారం పరిశీలించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా డ్రైనేజ్, వాటర్, బాత్రూమ్స్, పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని పలు సమస్యలు ఉన్నాయని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కు విషయం తెలియజేసి సంబంధిత అధికారులతో మాట్లాడి ఐసిడిసి మండల మహిళా సమైక్య కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు