Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్సాధారణ జ్వరాలే

సాధారణ జ్వరాలే

- Advertisement -

, ప్రత్యేక క్యాంప్ లు పర్యవేక్షణ

జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర – తాళ్లపూడి : జిల్లాలో నమోదు అవుతున్న జ్వరాల కేసులు ప్రమాద కారం కాదని, అన్ని గ్రామాల్లోను ముఖ్యన్గా జ్వరాలు నమోదు అవుతున్న ప్రాంతాల్లో  ప్రత్యేక మెడికల్ కాంప్ లు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన బుధవారం తాళ్లపూడి మండలం లోని తాళ్లపూడి పి.ఎచ్.సి ని సందర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, తాను సాధారణ పర్యవేక్షణకై వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం  జ్వరాలు వస్తున్న సందర్భాలు పరిశీలించిన మీదట ప్రత్యేక క్యాంప్ లు పేట్టాలని సిబ్బంది కు సూచించానని అన్నారు. రొంప, జలుబు తో జ్వరాలు, వళ్లునొప్పులు తో కూడిన జ్వరాలు  రెండు రకాల జ్వరాలు వుంటాయని రెంటికీ మందులు అందు బాటు లో ఉన్నాయన్నారు. గ్రామాల్లో లార్వా పెరగకుండా మందులు  సచివాలయం సిబ్బంది సహకారం తో పిచికారీ చేస్తున్నామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు