Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర -గోకవరం :గోకవరం మండలం రంప ఎర్రంపాలెం రైతు భరోసా కేంద్రం నందు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ మామిడి,జీడి మామిడి రైతులకు ఒక రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. దీనికి విశ్రాంతి సస్యరక్షణ అధికారి ఈ విజయ్ ప్రసాద్ మామిడి జీడి మామిడి చేపట్టవలసిన యాజమాన్యం ఎరువులపై అవగాహన కల్పించారు. ప్రతి చెట్టుకు రెండు మీటర్ల అడుగు దూరంలో ఆరడుగు వెడల్పు ఆరడుగు లోతు చేసుకుని ప్రతి చెట్టుకు రెండు వందల యాభై గ్రాముల నత్రజని 60 గ్రాముల బాశ్వరం 60 గ్రాములు పొటాషియం ఇచ్చే ఎరువులతో పాటు 50-100 కిలోల పశువుల ఎరువును వేసుకుని మట్టితో పుడ్చాలని  ఆయన రైతులకు వివరించారు. ఇప్పుడున్న తోటలో అధిక సాంద్రత పద్ధతిలో ఎకరానికి 100-150 చెట్లు తక్కువ దూరంలో వేసుకుని ప్రతి సంవత్సరము కొమ్మలు కత్తిరింపు చేపట్టడంతో అధిక దిగుబడే సాధించవచ్చని ఆయన వివరించారు. పామాయిల్ పతాంజలి కంపెనీ టెక్నికల్ ఆఫీసర్ కార్తీక రెడ్డి మాట్లాడుతూ. రిప్ ద్వారా ఎరువులు అందిస్తే 25% ఖర్చు కోవచ్చునని 10% అధిక దిగుబడి సాధించవచ్చునని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సహాయకులు నిహారిక సౌమ్య సావిత్రి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు