సి డి పి ఓ డి సంధ్యారాణి.
విశాలాంధ్ర -గోకవరం : గోకవరం మండలానికి చెందిన పెరవలి శశి, పెరవలి హెరిన్ యొక్క తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వారికి గోకవరం సెక్టార్ పరిధిలో అంగన్వాడి సెంటర్ 3లో ఉంటున్న వీరు ఇరువురికి పిఎం కేర్ నిధులు ద్వారా 2021 సంవత్సరం నందు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు స్థానిక ఇండియన్ బ్యాంకు నందు డిపాజిట్ చేయడం చేయడం జరిగిందని ఐ సి డి ఎస్ సిడిపి ఓ డి సంజయ్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరు ఇరువురికి 10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీని ప్రతి సంవత్సరం పిల్లల చదువుల కొరకు యూనిఫార్మ్స్ బుక్స్ వారి ఖర్చులు నిమిత్తం పిల్లల యొక్క సంరక్షకులకు ప్రతి సంవత్సరం ఆ వడ్డీని ఇవ్వటం జరుగుతుందని అది ఒక్కొక్కరికి 55 వేల రూపాయలు వడ్డీ గా రావడం జరిగిందని ఆ మొత్తాన్ని బుధవారం స్థానిక ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బి సూర్య అనుదీప్ కుమార్ కు చెక్కు ఇచ్చి వారి యొక్క సొంత అకౌంట్లో అమౌంట్ వేయాలని కోరడం జరిగిందని ఆమె వివరించారు. విరి వెంట గ్రేడ్ వన్ సూపర్వైజర్ పెనుగొండ ఇందిరా రాణి, బీ పీ సీ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


