విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు స్థానిక గణేష్ చౌక్ సెంటర్లోని గణపతి కుమార స్వామి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఎస్సై 2 గా పనిచేస్తున్న జి. పరమహంస దుర్యోధనుడు ఏక పాత్ర అభినయం చేశారు. ఆయన నటన నభూతో నభవిషత్ అన్న మాదిరిగా ఉందంటూ పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానిస్టేబుల్ గా, ఏఎస్ఐ గా, ప్రస్తుతం ఎస్ఐగా పట్టణ ప్రజలకు సుపరిచితమైన పరమహంస ఏకపాత్రాభినయం లో దుర్యోధనుడిని అనుకరించి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడం గొప్ప విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఆధునిక టెక్నాలజీలతో సినిమాల్ని తీస్తూ, వెబ్ సిరీస్ వైపు యువత ఆకర్షతులవుతున్న నేటి పరిస్థితుల్లో పౌరాణిక పాత్ర అయినటువంటి సుయోధన చక్రవర్తి దుర్యోధనుడి ఏకపాత్రభినయం సునాయాసంగా చేసి ప్రేక్షక హృదయాలను ఆకట్టుకున్న పరమహంస నేటి యువతకు ఆదర్శమంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. నాటక రంగం కనుమరుగవు తున్ననేటి రోజుల్లో ఒక ప్రక్క బాధ్యత గల ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని నిర్వహిస్తూ, ఎంతో ప్రసిద్ధి చెందిన దుర్యోధనుడి పాత్ర లోని పొడవైన వ్యాఖ్యానాలను తూచా తప్పకుండా తడబడకుండా అభినయించిన విధానం ఎంతో అభినందనీయం, ప్రశంసనీయం.ఈ సందర్భంగా పట్టణ శ్రీ కృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు గాలి బంగారయ్య ఆధ్వర్యంలో యాదవ సంఘం సభ్యులు పరమహంసను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొక్కిరాల రాజు యాదవ్, అంధూరి విశ్వనాధ్ యాదవ్, దండుబోయిన రాము యాదవ్, గుడ్ల సుభ్రమణ్యం యాదవ్, గానుబోయిన పాండురంగారావు యాదవ్, మెరుగుమువ్వల సీతారామయ్య యాదవ్, మేకల నరసింహారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దుర్యోధనుడిగా ఎస్ఐ పరమహంస అదుర్స్
- Advertisement -
RELATED ARTICLES


