ముప్పాళ్ల గ్రామంలో పీ4 అద్బుత ఫలితాలు..
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు ప్రతిరూపమైన పీ4 మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యరూపం దాల్చగా నేడు ముప్పాళ్లలో మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలకు అందుతున్న సహాయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతిష్టాత్మకంగా పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి ,బంగారు కుటుంబాలతో లబ్ధి పొందుతున్న కొండ్రు వెంకటరావమ్మ, కోట వెంకటరత్నం ఇళ్ళకు బుధవారం జిల్లా కలెక్టర్ , ఆర్‌డీవో కె.బాలకృష్ణతో కలిసి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించి, వారి స్థితిగతులు, ఆదాయ పెరుగుదలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా పీ4 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామి మేరకు కొండ్రు వెంకటరావమ్మ బంగారు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం, ఇంటి మంజూరు, ఆటో, కుట్టు మిషన్, కోట వెంకటరత్నం బంగారు కుటుంబానికి ఆటో ఇప్పించడంతో పాటు పిల్లలను ఉన్నత చదువులు చదివించి పేదరికం నుంచి బయటపడే వరకు మార్గదర్శులు తోడుండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.ఈ పర్యటనలో ఎంపిడివో పద్మజ్వోతి, తహాశీల్థార్ రామకోటేశ్వరావు ఉన్నారు.


