Homeజిల్లాలుశ్రీ సత్యసాయికోడిపందెం ఆడుతున్న వ్యక్తి అరెస్ట్..

కోడిపందెం ఆడుతున్న వ్యక్తి అరెస్ట్..

- Advertisement -

11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు.
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామ సమీపములో గల కొండపైన కోడిపందెం ఆడుతున్నారన్న రహస్య సమాచారముతో రూరల్ ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడి చేసి, కోడిపందెం ఆడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద రూ.250 తో పాటు 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మరికొంతమంది పరారీలో వెళ్ళిపోయారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయి అని తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు గ్రామాలలో ఎక్కడైనా జరుగుతూ ఉంటే సమాచారాన్ని రూరల్ పోలీసులకు గాని, మహిళా పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. కావున గ్రామ ప్రజలు సహకారమందించి చట్టబద్ధంగా జీవించేలా ఉండాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు