- Advertisement -
కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిరోజు అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రతిమాట కుతాంత్రాలతో మాట్లాడుతూ ప్రతి పని మోసపూరితంగా చేయటంతో ప్రజలు విసుగుపోయి ప్రభుత్వాన్ని శిక్షించటానికి సిద్ధంగా ఉన్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.యస్.బోస్ అన్నారు. ఈ మధ్య తాలిబన్ నాయకులను మన దేశం ఆహ్వానించి వారితో మంతనాలు జరిపి మంచి ఆతిథ్యం ఇవ్వటం దేశ ప్రజలందరు గమనించారు. దీనితో మోడీ ప్రభుత్వం తాలిబన్లను శాంతికాముకులుగా గుర్తిస్తున్నదా అని ఆయన ప్రశ్నించారు. తాలిబన్లను శాంతికాముకులుగా మన దేశంలోని నక్సలైనట్లను ఉగ్రవాదులుగా చూస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ ద్వందనీతిని ఖండిస్తున్నాను. తాలిబన్లను ఒకప్పుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఉగ్రవాదులుగా ప్రకటించటం జరిగింది. నేడు మన ప్రభుత్వం వారిని ఉగ్రవాదులుగా కాక మరోరకంగా చూడటంలో అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. మోడీ దేశంలోను మరి ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న తన మిత్రుడు ట్రంప్‌తో కలిసి రూపుమాపుతామని ప్రగల్భాలు పలికి ఈ రోజు తాలిబన్లతో చేయి కలపటం పలాయన వాదం కాదా అన్నారు. మన దేశంలో ఉన్న నక్సలైట్లు ప్రస్తుత సమాజంలో మార్పు రావాలని అంతరాలులేని మరియు దోపిడీలేని సమాజం కావాలని కోరుకుంటున్నారు. కానీ తాలిబన్ల ఉద్దేశం, ఆలోచన, కార్యక్రమం ఆ రకంగా లేదు. అయినా మోడీ వారిని గౌరవించి మన దేశానికి పిలవటం మన దేశ సంస్కృతికి, సాంప్రదాయానికి విరుద్ధం. దీనిపై మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మన దేశంలో తాలిబన్లు నిర్వహించిన పత్రికా సమావేశంలో మహిళా పత్రికారులను అనుమతించకపోవటంతో దేశంలోని అభ్యుదయవాదులతో పాటు పత్రికా రంగం దేశవ్యాపితంగా తమ నిరసనను తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖండన లేకపోవటంతో ఆ పత్రికా సమావేశంతో తమ ప్రభుత్వానికి ఏలాంటి సంబంధం లేదని ప్రకటించటం సిగ్గుచేటు మరియు దేశ గౌరవానికి భంగకరం. మన దేశంలో మన ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా ఇతర దేశ నాయకులు మన దేశంలో పత్రికా సమావేశం పెట్టటం ఎలా సాధ్యమవుతుందో మోడీ చెప్పాలన్నారు. తాలిబన్లు మహిళా పాత్రికేయులను అనుమతించకపోవటం మనువాద సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం తాలిబన్ల ప్రవర్తనను ఖండిరచలేదన్నారు. దేశంలో కేవలం భారత రాజ్యాంగమే అమలువుతుందని మనువాదం కాదనేది మోడీ మరియు అమిత్ షా అర్ధం చేసుకోవాలి. అలా కానీ పక్షంలో దేశ ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని శిక్షించక తప్పదని హెచ్చరించారు. దేశంలోని నక్సలైట్లపై ఒకరకంగా తాలిబన్లపై మరోరకంగా ప్రవర్తించటం మోడీ ప్రభుత్వంలోని సిద్దాంత తారతమ్యం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించి వాస్తవాలు గ్రహించి రాజ్యాంగ ద్రోహులకు సరైన బుద్ది చెప్పటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.


