Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా ఉద్యమం తెస్తాం..

సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా ఉద్యమం తెస్తాం..

- Advertisement -

సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి హబి బుర్ రెహమాన్
విశాలాంధ్ర ధర్మవరం; సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా ఉద్యమాన్ని తెస్తామని సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి హబి బుర్ రెహమాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 12.. 2025 నాటికి సమాచార హక్కు చట్టం 2005 ఆమోలులోకి వచ్చి 20 సంవత్సరాల కాలం పూర్తి కావడం పట్ల వారు శుభాకాంక్షలు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా తెలియని విషయాలు తెలుసుకోవడం, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేంతవరకు ఈ సమాచార హక్కు చట్టం పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సమాచారాన్ని మనం హక్కుగా పొందగలుగుతామని తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాలలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించుటకు గాను, అవినీతిని అరికట్టుటకు ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఇప్పటికీ 226 చోట్ల చట్టంపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ చట్టాన్ని ప్రజలకు సులువుగా అర్థం చేసుకునేందుకుగాను చట్టం పుస్తకం తో పాటు ఒక గైడును కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూమి సమస్యలు పరిష్కరించి చాలా చోట్ల తిరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అధికార దృష్టికి తెచ్చి పరిష్కరించిన ఘనత సమాచార హక్కు చట్టంకే దక్కిందని వారు స్పష్టం చేశారు. కావున ఈ చట్టాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని న్యాయం పొందాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు