Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలి..

ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలి..

- Advertisement -

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత పరిస్థితులు, ఔషధాల లభ్యత, సిబ్బంది హాజరు వంటి అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందుతున్న రోగులతో వారు వ్యక్తిగతంగా మాట్లాడి వారికి అందిస్తున్న సదుపాయాలు గూర్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆసుపత్రి సిబ్బందికి రోగుల పట్ల పూర్తిగా శ్రద్ధ, దయ, సేవా భావంతో కూడిన విధులు, బాధ్యతతో వైద్యులతో పాటు సిబ్బంది తప్పక మెలగాలని వారు తెలిపారు. అంతేకాకుండా తప్పనిసరిగా ఆసుపత్రి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిమీద ఉందని, పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని తెలిపారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ నేతృత్వంలో తప్పక ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా వైద్యులు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, సీరియస్ గా ఉన్న రోగుల పట్ల వైద్య చికిత్సలను అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అవకాశాన్ని బట్టి మరింత సమయాన్ని ఇచ్చి రోగులకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే పరిపాలన యొక్క ప్రధాన లక్ష్యము అని వారు స్పష్టం చేశారు. తదుపరి ఆసుపత్రిలోని సమస్యలను వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, హెడ్ నర్సులు, సిస్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు