Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ అవార్డు గ్రహీత జూజారె నాగరాజుకు సన్మానం..

జాతీయ అవార్డు గ్రహీత జూజారె నాగరాజుకు సన్మానం..

- Advertisement -

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం వాసి, ప్రముఖ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత జూజారే నాగరాజును రోటరీ క్లబ్ కమిటీ అధ్యక్షులు నాగభూషణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఆవరణములో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే నాగరాజు చేనేత పరిశ్రమకు చేసిన సేవలు పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకోవడం మన ధర్మావరానికి గర్వకారణం అని వారు తెలిపారు. ఇటువంటివారు ధర్మవరంలో మరింత పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలని వారు తెలిపారు. మా రోటరీ క్లబ్ తరఫున డిజైనర్ నాగరాజుకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీత నాగరాజు మాట్లాడుతూ తన చిన్న వయసు నుంచి ఇప్పటివరకు పట్టు చీరలపై దేవుళ్ళు, ప్రముఖ రాజకీయ నాయకులు, మహాభారతం, రామాయణంలోని వివిధ ఘట్టాలను చీరలపై చిత్రీకరించడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరము అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా చేనేత పరిశ్రమను ప్రజలందరూ గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమలు నమ్ముకున్న వాళ్ళందరికీ మరింత చేయూత ఇచ్చినప్పుడే ధర్మవరం లాంటి చేనేత పరిశ్రమ అభివృద్ధి దిశలో అడుగు పెడుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంప్ చైర్మన్ సుదర్శన్ గుప్తా, దాత చిందలూరు రాఘవేంద్ర, సత్రశాల ప్రసన్న కుమార్, శ్రీనివాసుల రెడ్డి, పెరుమాళ్ళ దాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు