అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల కళ్ళకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఆవరణములో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్య చికిత్సలతో పాటు కంటి ఆపరేషన్లు అద్దాల పంపిణీని ఇప్పటివరకు 30 వేలకు పైగా ప్రజలకు సేవ చేయడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో 108 మంది కంటి వైద్య చికిత్సలను చేయించగా అందులో 79 మంది మాత్రమే కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరేందరికి బ్యాంకులోని శంకరా కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ల వేయించడం జరుగుతుందన్నారు. ఉచిత ప్రయాణం, ఉచిత వసతి ఉంటుందన్నారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చింద లూరు పద్మావతమ్మ, కీర్తిశేషులు సి. సత్యనారాయణ (సత్య కృపా సిల్క్స్ ధర్మవరం) వారి కుమారులు మల్లికార్జున రాఘవేంద్ర కేదార్నాథ్, వారి కోడలు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. అనంతరం రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి సంకారపు నరసింహులు రోగులకు కంటి డ్రాప్స్ ను వేసి, కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దాతను, శంకరా కంటి ఆసుపత్రి డాక్టర్ షైన్ ఘనంగా కమిటీ వారు సత్కరించారు. తదుపరి ఆపరేషన్ తర్వాత కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా రోటరీ క్లబ్ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్న కుమార్, మనోహర్ గుప్తా, రమేష్ బాబు, పెరుమాల దాస్, చందా జై చంద్ర, శ్రీనివాస్ రెడ్డి, అంబికా, తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల కళ్ళకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


