Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలి..

చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలి..

- Advertisement -

రిటైర్డ్ జిల్లా ఆందత్వ నివారణ అధికారి సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, జిల్లా వైద్యాధికారి సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. కంటి పట్ల తాను సర్వీసులో ఉన్నప్పుడు వేలాదిమందికి అవగాహనతో పాటు, కంటి చూపు యొక్క ప్రాధాన్యతను తెలపడం జరిగిందన్నారు. కంటిలో నలుసు పడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలే తప్ప, నాటు వైద్యం చేయించరాదని అందువల్ల కంటిచూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దసరాలో బాణాలు వేసుకోవడం, హోలీలో రంగులు చెల్లుకోవడం, దీపావళిలో బాణాసంచా కాల్చడంలోనూ కంటికి దెబ్బ తగలకుండా తల్లిదండ్రులు తమ పిల్లల బట్ట ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని తెలిపారు. అదేవిధంగా వృద్ధాప్యంలో చూపు క్రమంగా తగ్గుతూ బట్ట తెర కట్టినట్లు కనిపిస్తుంటే కంటి శుక్లము గాని ప్రమాదకరమైన నీటి శుక్లము(గ్లోకోమా) గాని కావచ్చునని తెలిపారు. ఇటువంటి దానిని కంటి డాక్టర్ వద్ద మాత్రమే సంప్రదించి, చికిత్స ద్వారా కంటి చూపును తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్తులు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని, కావున క్రమం తప్పకుండా కళ్ళను ఆరు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలన్నారు. చిన్న బిడ్డలకు కంటిలో నీరు కారుచున్నచో ప్రారంభ దశలోనే కంటి డాక్టర్ని చూపించి తప్పనిసరిగా సలహాలను పాటించాలని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు దగ్గర చూపు, దూరము చూపు, ఇలాంటి వ్యత్యాసాలతో చదువు విషయంలో ఇబ్బందిగా ఉంటే కంటి డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. పిల్లలకు 9వ నెలలో తట్టు టీకా తో పాటు విటమిన్ ఏ ద్రవం ఇప్పించాలని తెలిపారు. కావున తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కళ్లను ప్రేమిస్తూ, కల్లపట్ల సరియైన జాగ్రత్తగా ఉంటూ భద్రత కల్పించుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు