మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ
విశాలాంధ్ర అనంతపురం : మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలనుమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ సోమవారం ప్రారంభించారు. అవగాహన కార్యక్రమాన్ని కార్డియో పల్మనరీ అనస్థీషియా ప్రధాన విభాగాధిపతి ఆచార్య ఏ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ , ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బెనెడిక్ట్ హాజరయ్యారు.ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని సి. పి.ఆర్ ద్వారా కాపాడితే వారి కుటుంబానికి ఎంతో మేలు చేసినట్లు ఉంటుందన్నారు. మెదడు కు రెండు నుంచి మూడు నిమిషాలు వరకు ప్రాణ వాయువు అందకపోయినా కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది కావున ఆ సమయం లో తక్షణమే సి.పి.ఆర్ ద్వారా ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. ప్రతి వ్యక్తి కి సి. పి.ఆర్ పైన అవగాహన కలిగి ఉండటం తప్పని సరి అని అన్నారు.
సామాన్యుడు కూడా సి. పి.ఆర్ యొక్క ప్రాముఖ్యత ను తెలుసుకోవడం ద్వారా,ఇరుగు పొరుగు వారికి చెప్పడం ద్వారా ఎంతో మందిని అత్యవసర పరిస్థితుల్లో రక్షించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమం లో అనస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ లు డాక్టర్ మధుసూదన్,శ్రీహరిబాబు,ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు డాక్టర్ సుమన్ గోపీచంద్,డాక్టర్ లలిత భవాని,పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు,2025 వ బ్యాచ్ ఎంబిబిఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలు
- Advertisement -


