Homeజిల్లాలుకర్నూలుఘనంగా వైకుంఠం శ్రీరాముల జన్మదిన వేడుకలు

ఘనంగా వైకుంఠం శ్రీరాముల జన్మదిన వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆలూరు టిడిపి ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్ కుమారుడు వైకుంఠం శ్రీరామ్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల యూత్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర, టిడిపి సీనియర్ నాయకులు సంజన్న, బత్తిన జీవన్ కుమార్, ముత్తుకూరు మల్లికార్జున, కట్టెల ప్రకాష్, మాజీ మార్కెట్ డైరెక్టర్లు సంజన్న, బైలుపత్తికొండ గోవిందు, కారుమంచి రవి రెడ్డి, యువ నాయకులు యస్‌.మహేష్‌, శేశిరెడ్డి, మహానంది, అట్టేకల్ రాజశేఖర్, కూటమి నాయకులు శ్రీనివాసులు, పరమేష్‌తో పాటు పలువురు టిడిపి కార్యకర్తలు, వైకుంఠం శ్రీరామ్ అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు