- Advertisement -
విశాలాంధ్ర – కడియం : రూపాయి నాణెములతో అలంకరించిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కడియం మండలం, కడియపులంక గ్రామంలో, రామాలయం వీధిలో ఆరేటి భద్రరావు ఇంటి పక్కన ఈ వినాయకుడి విగ్రహం ప్రతిష్టించారు. శ్రీ విజయ గణపతి స్వామి 19 వ వార్షికోత్సవం సందర్భముగా స్వామి వారి విగ్రహాన్ని ముందుగా మట్టితో రూపొందించి, ఆ విగ్రహంపై 5000 ఒక రూపాయి నాణెములు మరియు 600 అయిదు రూపాయల నాణెములతో, మొత్తం 8600 రూపాయల విలువ చేసే నాణెములతో స్వామి వారిని అలంకరించినట్లు విజయ గణపతి యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.


