విశాలాంధ్ర నందవరం ..వలస కూలీ కొడుకు టీచర్ ఉద్యోగం సాధించాడు. మిట్టసోమపురం గ్రామానికి చెందిన ఉప్పరి బొజ్జన్న, ఉప్పరి దేవమ్మల కుమారుడు ఉప్పరి రాము మెగా డీఎస్సీ లో ఎస్జిటి లో 76 మార్కులతో ఉద్యోగం సాధించాడు. కాగా ప్రస్థుతం కర్నూలులో జీవనం సాగిస్తున్నారు. తల్లి తండ్రులు రోజువారీ కూలీ పని చేస్తూ, కుమారుడిని చదివించడం జరిగి౦దని, ఉద్యోగం సాదించదంతో తల్లిదండ్రులు గ్రామస్తులు హర్ష౦ వ్యక్తం చేశారు. ఈ సందర్బముగా రాము మాట్లాడుతూ తన తల్లి తండ్రుల కష్టం మరియు కృషి వల్లనే ఈ విజయాన్ని సాధించాను. మరియు కష్టపడి చదివితే ఏదైనా సాదించవచ్చని అన్నారు. దీంతో రాముని కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అభినందించారు.


