ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సచివాలయాలలో ఆధార్ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
దీని కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని వారు తెలిపారు.కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం
- Advertisement -
RELATED ARTICLES


