Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం బస్ స్టాండ్… అంతట స్వచ్ఛత - పచ్చదనం

ధర్మవరం బస్ స్టాండ్… అంతట స్వచ్ఛత – పచ్చదనం

- Advertisement -

బస్టాండ్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు.. P: డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం ఆర్టీసీ డిపో పరిధిలో బస్టాండ్ పరిశుభ్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ అటు అభివృద్ధిలో కాకుండా ఇటు స్వచ్ఛత లోను పరుగులు తీస్తోందని సంకేతాలు చాటి చెబుతుంది అని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పై చేయిగా ఉండడం జరిగిందన్నారు.సత్యసాయి రీజన్ డిపిటిఓ మధుసూదన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతకు అనుగుణంగా ముందుకు వెళుతూ ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలనే మారడం జరిగిందన్నారు. బస్టాండ్ ప్రారంభం నుంచి చివరి వరకు పచ్చదనం ఉండేలా మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఈ మొక్కల భద్రత కోసం చుట్టూ కంచెను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. కార్యాలయం ఆవరణ వరండాలలో మొక్కలు కుండీలు పెట్టి సుందరంగా అలంకరించడం జరిగిందన్నారు. ఉద్యోగుల సైతం స్వచ్ఛతను పాటించేలా అవగాహన కల్పించి బస్టాండ్కు వచ్చే వారికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు అని తెలిపారు. మైకు ద్వారా బస్సుల వివరాలు సూచనలు ప్రయాణికులకు తెలుపుతున్నామని తెలిపారు.స్వచ్ఛతకే కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం సౌకర్యవంతమైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, సమాచార కేంద్రం,వేచి ఉండుటకు కుర్చీలు , ఫ్యాన్ సౌకర్యం, మొబైల్ రీఛార్జ్,వినోద కొరకు టీవీలు,తల్లి చిన్నపిల్లలకు పాలు ఇచ్చు గది, టూ వీలర్ పార్కింగ్ సదుపాయం,టికెట్ రిజర్వేషన్ కౌంటర్,పార్సెల్ బుకింగ్ కౌంటర్, బస్సులు బయలుదేరు సమయాల సమాచార పట్టిక , దూర ప్రాంత బస్సులు గమ్యస్థానానికి చేరు సమయపట్టిక వంటి అనేక సౌకర్యాలు ప్రయాణికుల కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు