Homeజిల్లాలుపార్వతీపురం మన్యంఅగ్నిప్రమాద బాధితురాలు శ్రీదేవి కుటుంబానికి పలువురు చేయూత

అగ్నిప్రమాద బాధితురాలు శ్రీదేవి కుటుంబానికి పలువురు చేయూత

- Advertisement -

విశాలాంధ్ర, పార్వతీపురం: సీతానగరం మండల కేంద్రంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్యం కోల్పోయిన బాధితురాలు యాడాది శ్రీదేవి కుటుంబాన్ని మంగళవారంనాడు పలువురు పరామర్శించారు. సీతానగరం మండలంలోని శ్రీవీరబ్రహ్మేంద్రసంఘం తరుపున కమిటీనాయకులు ఆచారి, శంకరరావు,అప్పారావు, జగదీశ్వరరావు, రామకృష్ణలు 10వేల రూపాయలను అందజేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అందజేసిన 5వేల రూపాయలను సీతానగరంనాయకులు సాల హరిగోపాలరావు, గరికయ్య, అరవింద్ కుమార్, సబ్బాన శ్రీనివాసరావు బుడితి శ్రీనివాసరావు తదితరులు అందజేశారు. పెదబోగిలి ఉప సర్పంచ్ కంకణాలపల్లి అరవింద్ కుమార్ 3వేల రూపాయలు అందజేసారు. పెదబోగిలి మాజీ సర్పంచ్ బుడితి శ్రీనివాసరావు 2వేల రూపాయలు అందజేశారు. సీతానగరం సుంకరివీధి వార్డుమెంబర్ పిన్నింటి రామారావు 2వేల రూపాయలు అందజేశారు. గెడ్డలుప్పి కూడలిలోఉన్న కృషి విద్యానికేతన్ కరెస్పాండెంట్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాఠశాల తరుపున 2వేల రూపాయలు అందజేశారు. సీతానగరం వాసవిక్లబ్ తరుపున నెలకు సరిపడే నిత్యావసర సరుకులు,వస్త్రాలు అందజేసినట్లు సంఘ నాయకులు మమ్ముల విశ్వేశ్వరరావు సత్యనారాయణ, లక్ష్మణరావు, దేవుడు లు తెలిపారు. సర్వస్వం కోల్పోయిన శ్రీదేవి కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయాన్ని అధికారులు అందజేయడంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలువురు విమర్శిస్తున్నారు. సర్వస్యం కోల్పోయిన బాధితురాలకు ప్రభుత్వ పరంగా తక్షణమే బియ్యము, కొంత నగదును చెల్లించాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు