డి ఆర్ ఒ మలోలకు వినతి పత్రం అందజేత
విశాలాంధ్ర అనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలు తక్షణమే నెరవేర్చాలని డి ఆర్ ఓ మాలోలకు ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు.అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి తీవ్ర స్థాయికి చేరినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలి.నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందించాలన్నారు. ఎస్, ఎస్ టి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి, విద్యార్హత ఆధారంగా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర అశోక్,కన్నా,తేజ తదితరులు పాల్గొన్నారు.


